తెలుగు ఇండస్ట్రీకి ఒకప్పుడు మంచి హీరోగా పరిచయమైన చంద్రమోహన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు .ఆయన నటించిన సినిమాల్లో సిరిమల్లె పువ్వు సినిమాలో ఆయన శ్రీదేవితో చేసిన యాక్టింగ్ ఎప్పటికీ మరువలేనిది. అంతేకాదు ఆయన నటించిన చాలా సినిమాలలో మంచి పాత్రలను పోషించి మంచి అభిమానాన్ని పొందాడు .హీరోతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించారు. అంతేకాదు నాగేశ్వరరావు అప్పట్లో చంద్రమోహన్ కి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అదేంటంటే కొంచెం పొడవు ఉంటే పెద్ద హీరోగా

  ఎదిగేవాడు అనే మాట చంద్రమోహన్ కి అవార్డు లాగా అనిపించిందట. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు కానీ ఆయన యూట్యూబ్ కి మాత్రం చాలా దగ్గర .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ గారు మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పడం జరిగింది . అదేంటంటే చిరంజీవి గారు చంద్రమోహన్ గారికి జూనియర్ ఆ సమయంలో చంద్రమోహన్ హీరో స్థాయిలో ఉన్నాడు .ఆ సమయంలో చిరంజీవి ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రావడం జరిగింది.

అనంతరం చాలా సినిమాల్లో నటించి హీరో స్థాయికి ఎదిగాడు .అయితే అప్పట్లో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేశారని అప్పుడు చంద్రమోహన్ గారి రెమ్యూనరేషన్ 25000 అని చిరంజీవి రెమ్యూనరేషన్ 5000 అని ఆయన చెప్పుకొచ్చారు .చిరంజీవి ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని ఆయన క్రమశిక్షణ అలాగే పట్టుదల ఆయన్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి ఇవాళ ఈ స్థాయికి రావడానికి అల్లు అరవింద్ కూడా ఒక కారణమని చెప్పాలి అంటూ చెప్పాడు .అప్పట్లో చిరంజీవి ఎలాంటి సినిమాలు చేయాలి దానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవాలి అని అన్ని విషయాలను అల్లు అరవింద్ చెప్పేవాడని ఆయన సలహాలు ఇచ్చేవారని తెలియజేశారు చంద్రమోహన్ .కాగా చిరంజీవి గురించి చంద్రమోహన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: