అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశం ముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అనంతరం వరుసగా స్టార్ హీరోల సరసన నటించడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది .తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యాక కోలీవుడ్ లో కూడా నటించడం జరిగింది. దాంతో అక్కడ కూడా స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించడం జరిగింది.

గత కొన్ని రోజుల నుండి హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ చాలా వార్తలు వచ్చాయి .ఇలాంటి వార్తలు వచ్చినా కూడా హన్సిక మాత్రం స్పందించలేదు. ఎవరు ఊహించని విధంగా తన లవర్ ఆమెకు ప్రపోజ్ చేసిన ఒక ఫోటోని షేర్ చేసి అందరికీ షాప్ ఇచ్చింది .ఈమె ఒక్క ఫోటోతో ఈమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అంటూ అనేక వార్తలు రావడం జరిగింది. ఒక ఫోటోతో అందరికీ క్లారిటీ ఇచ్చింది హన్సిక .ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె పెళ్లిలో మరొక ఆశ్చర్యం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకోబోయే భర్తకి ఇది రెండు పెళ్ళంట అంతే కాదు మొదటి భార్య ఎవరో కాదు హన్సిక స్నేహితురాలే అని అంటున్నారు.

అంతేకాదు హన్సిక  చేసుకోబోయే భర్త మొదటి పెళ్లికి కూడా వెళ్లడం జరిగిందట .తాజాగా జైపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలు ఎక్కారు ఈ దంపతులు. అయితే పెళ్లి 24 గంటలు కూడా కాకముందే హన్సిక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. హన్సిక తీసుకున్న నిర్ణయానికి భర్త సైతం షాక్ అయ్యాడట పెళ్లి తర్వాత  హన్సిక సినిమా షూటింగ్లలో పాల్గొంటుందట. అంతేకాదు తన సినిమాకు సంబంధించిన అన్ని పనులు మరియు షూటింగ్ పూర్తి అయిన తర్వాతే హనీమూన్ కి వెళ్దామని ఆమె భర్తతో చెప్పడం జరిగిందట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఇక ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు హన్సిక కి సినిమాలంటే ఇంత ఇష్టమా అంటూ పొగుడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: