తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కాంబినేషన్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట గా అతడు మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ద్వారా మహేష్ బాబు కు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఖలేజా మూవీ తేరకెక్కింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఆ తరువాత మాత్రం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం మూడవ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం దుబాయ్ కి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ మహేష్ బాబు 28 వ మూవీ కోసం మూడు సెట్ లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు సెట్ లను కూడా భారీ వ్యయంతో మూవీ యూనిట్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన రెండవ హీరోయిన్ గా శ్రీ లీల నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: