టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన నటించిన కుటుంబ కథ సినిమాలో ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత శ్రీకాంత్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి ఊహను పెళ్లి చేసుకోవడం జరిగింది. అనంతరం వీరి కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు జన్మించడం జరిగింది. అయితే అతని మొదటి కొడుకు రోషన్ సినిమాల్లోకి ఇటీవల ఇంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటగా నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించి పరిచయమైన రోషన్సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ..

 దాని అనంతరం పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్నాడు .రోషన్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా దబాంగ్ 3 సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం కూడా జరిగింది .అయితే ఒక టాలీవుడ్ హీరో కొడుకు బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అన్నది నమ్మలేని విషయం. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది .అయితే ఆయన మాట్లాడుతూ ఒక సౌత్ ఇండియన్ ని అని చెప్తే ఎవరూ నమ్మలేదు సౌత్ ఇండియాలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు .

అక్కడ చూసిన వాళ్ళందరూ నన్ను హృతిక్ రోషన్ లా ఉంటాను అని చెప్పేవాళ్ళు ఇక గత కొన్ని నెలల కిందట శ్రీకాంత్ రెండో కొడుకు రోహన్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా దర్శకత్వంలో రోహన్ మొదటి సినిమా ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఆ వార్త లు బయటకు రాలేదు. అయితే రోషన్ సినిమా స్టార్ట్ అయ్యిందా లేదా విడుదల ఎప్పుడు అవుతుంది అనే విషయాలు కూడా ఇప్పటికీ తెలియదు .కానీ ప్రస్తుతం శ్రీకాంత్ అభిమానులు మాత్రం ఆయన రెండవ కుమారుడి సినీ ఎంట్రీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: