కొలువుడ్లో విలక్షణమైన నటుడుగా మంచి క్రేజీ సంపాదించుకున్నారు హీరో విలన్ విజయ్ సేతుపతి. తన కెరియర్ మొదలు పెట్టినప్పుడు సైడ్ క్యారెక్టర్లలో నటించిన విజయ్ సేతుపతి ఒక్కసారిగా హీరోగా మారి విలన్ పాత్రలలో అదరగొట్టేశారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఉప్పెన సినిమాతో విలన్ పాత్రలో అదరగొట్టిన విజయ్ సేతుపతి ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. అయితే గడిచిన కొన్ని సినిమాలలో విజయ్ సేతుపతి కాస్త బొద్దుగా కనిపించారు.
అయితే ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారో లేక తనే మనసు మార్చుకున్నారు ఏమో తెలియదు కానీ తాజాగా సరికొత్త లుక్కుల సర్ప్రైజ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేకవర్ సినిమా కోసమేనా అన్నట్లుగా రెడీ అయ్యారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి స్లిమ్ లుక్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్లో సినిమాలే కాకుండా పలు హిందీ సినిమాలు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సినిమాలో జవాన్ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇవే కాకుండా మరొక రెండు చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి నటించిన పాత్ర హిట్ కావడంతో అలాంటి రోల్స్ లోనే ఎక్కువగా నటించడంతో పలు ఆఫర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఇక విక్రమ్ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించిన విజయ్ సేతుపతి సూపర్ క్రేజ్ అందుకున్నారు. తాజాగా లేటెస్ట్ లుక్కుల ఫ్యాన్స్ ని అలరించిన విజయ్ సేతుపతి సెల్ఫీ తీసుకొని మరి తన న్యూ లుక్కుని ఆడియన్స్ కి పరిచయం చేశారు. విజయ్ సేతుపతి సినిమాల్లోనే మాత్రమే విలన్ గా ఉంటారు బయట మాత్రం అభిమానులతో చాలా క్లోజ్ గా ఉంటారని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: