రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో చాలా హోమ్లీగా, నాచురల్ గా కనిపించిన ప్రభాస్ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలలో ఆ లుక్ ను ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్ ను ఎలా చూస్తే అభిమానులు మెచ్చుకుంటారో ఆ విధంగా దర్శకనిర్మాతలు ప్రభాస్ ను చూపించలేక పోవడమే ఆయన సినిమాల ఫ్లాప్ లకు కారణమైంది. నిజానికి ప్రభాస్ ను చక్కగా చూపించినట్లయితే కచ్చితంగా ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యేవి.

ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ లో విజయం లభించకపోవడం గమనార్హం. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో డిజాస్టర్ గా మిగలగా.. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ కూడా పూర్తిస్థాయిలో అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో ప్రభాస్ అభిమానులే కాదు నిర్మాతలు కూడా పూర్తి నిరాశ చెందారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమాలు ఇలా  డిజాస్టర్ అవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


ప్రభాస్ వరుస చిత్రాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఆయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయనలో మేకోవర్ చేసి సరికొత్తగా చూపించారు అన్ స్టాపబుల్ నిర్వాహకులు. సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపని ప్రభాస్ బాలయ్య మీద అభిమానంతో ఆహా అన్ స్టాపబుల్ షో కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ముఖ్యంగా ఈ షో ఇంకా ప్రోమో కూడా విడుదల చేయలేదు.. కానీ ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఫోటోలను విడుదల చేయగా అభిమానులు పాత ప్రభాస్ ను  చూస్తున్నాము అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఫార్మల్ లుక్ లో డార్లింగ్ సినిమాను తలపిస్తున్నారు ప్రభాస్. ప్రభాస్ లుక్కుకి ఫిదా అయిపోయి అన్ స్టాపబుల్ షో కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: