ప్రతిసారి సంక్రాంతి లాగానే ఈ సంవత్సరం సంక్రాంతి కి కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ... ఆ సినిమాలు ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
తునివు : తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ హీరో గా తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
వీర సింహా రెడ్డి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.


వారసుడు : తమిళ హీరో తళపతి విజయ్ హీరో గా తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.
వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
కళ్యాణం కమనీయం : సంతోష్ శోభన్ హీరో గా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గ తెరకెక్కిన ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.
విద్య వాసుల అహం : ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: