తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ .ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఏ ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కేవలం బాలీవుడ్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.అక్కడే పలు చిత్రాలలో నటిస్తు బిజీ హీరోయిన్గా మారిపోయింది. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో నటించిన గత చిత్రాలు అన్నీ కూడా భారీ డిజాస్టర్ ని మిగిలాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు తన గ్లామర్ తో కనువిందు చేస్తూ ఉంటుంది.

నిత్యం ఏదో ఒక ఫోటో షూట్లతో వైరల్ గా మారుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మరిన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. రకుల్ స్లిమ్ ఫిట్ అందాల పైన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఫిట్నెస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటుందని ఈమె శరీరాకృతిని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బక్క పల్చగా మారిపోయింది.

మరొకవైపు గ్లామర్ ని కాపాడుకుంటూనే హెవీ వర్కౌట్లు చేస్తూ పలు చిత్రాలలో విభిన్నమైన క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటుంది. ఎలాంటి ఫోటో షూట్ లో నైనా సరే అదరగొడుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా లెహంగా ఓణీలో కనువిందు చేసి తన అందాలను చూపించి చూపించకుండా నేటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందం ఫిట్నెస్ తో పాటు ఫ్యాషన్ లో కూడా తన మార్కు చాటుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. రకుల్ కమలహాసన్ తో ఇండియన్ -2 చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: