
అయితే ఈసారి మాత్రం పవన్ ను పొగిడేందుకు మైకు తీసుకొని ఆ మాటల ప్రసంగంలో కొన్ని తూటాలు కూడా పేల్చారు. దీంతో మరొకసారి పవన్ కళ్యాణ్ ఇరుకును పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా పడితే ఆ సినిమాలను చేయడంట. ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఒప్పుకోకుండా క్వాలిటీ ఉన్న సినిమాలే చేస్తాడంట. సరిగ్గా ఇక్కడే కొంతమంది నెటిజన్లు నాగబాబు పైన తీవ్రంగా విమర్శలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయారని కేవలం రీమిక్స్ మాత్రమే చేస్తారని కొంతమంది సెటైర్లు వేస్తూ ఉన్నారు.
ఇక క్వాలిటీ ఉన్న సినిమాలు ఏమిటంటే..పంజా, కొమరం పులి , కెమెరామెన్ గంగతో రాంబాబు అంటు సినిమాలంటూ మరికొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారానికి మొత్తం కారణం ఏమిటంటే తాజాగా వరుస పెట్టి రీమిక్స్ సినిమాలు చేయడంతో పవన్ కళ్యాణ్ పైన ఇలా అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పుండు మీద కారం చల్లినట్లు ఉందని చెప్పవచ్చు. ఇక వీటితోపాటు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్లాన్ ఏమిటి అని అడిగానని నాగబాబు అడిగారట.. అందుకు పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు ఏడాదికి చేస్తే సరిపోతుంది అని తెలియజేశారట. ఇక వీటితోపాటు రకాలు ట్రోలింగ్ కూడా చేయడం జరుగుతోంది.