
ఇప్పుడు మీడియాతో ఆమె మాట్లాడుతూ.. వైవాహిక బంధం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి.. అంతేకాదు మహేష్ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం.. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే ఏ బంధమైన సంతోషంగా సాగుతుందని నమ్రత తెలిపింది. గౌతమ్ పుట్టినరోజును మేమంతా ఎప్పటికీ మర్చిపోలేము. అది మా జీవితంలో ఒక భయానక సమయం. ఏడో నెలలో చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు పరీక్షించి.. బాబు పేగు మెడలో వేసుకున్నాడని.. తనకు ఊపిరి కూడా ఆడడం లేదని.. హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పారు. ఈ విషయాన్ని మహేష్ కు ఫోన్ చేసి చెప్పగా లక్కీగా మహేష్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఒక సినిమా షూటింగ్లో ఉండడంతో వెంటనే హాస్పిటల్ కి వచ్చాడు.
తాను వచ్చిన వెంటనే ఆపరేషన్ చేసి బాబును బయటకు తీశారు. అప్పుడు గౌతమ్ కేవలం 1.5 కేజీలు మాత్రమే ఉన్నాడు అంటూ నమ్రతా తెలిపింది. దాదాపు మూడు వారాలపాటు బాబుని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచామని రోజుకు 40 గ్రాముల పాలు మాత్రమే పట్టించాలని వైద్యులు సూచించినట్లు ఆమె తెలిపింది. ఇక ఆ తర్వాత గౌతమ్ ఆరోగ్యంగా తిరిగి రావడం దేవుడి మహిమే అని తెలిపింది. అంతేకాదు సితారా ను వీల్లు కనాలని అనుకోలేదట. అన్ వాంటెడ్ బేబీగా పుట్టిన ఈమె ఇప్పుడు వారి జీవితాన్ని సంపూర్ణం చేసింది.