సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో హిట్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న నక్కిన త్రినాథ రావు రవితేజతో చేసిన సినిమా ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ధమకా సందడి మొదలైంది అతని మ్యూజిక్ నుంచే అని చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే మాస్ సాంగ్స్ తో ఆల్బం మొత్తం అదరగొట్టేశాడు భీంస్.

ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమాలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత మళ్లీ ఫ్లాప్ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రిస్ మస్ కి మాత్రం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సూపర్ హిట్ బొమ్మ తో వస్తున్నారు రవితేజ. ఇది టార్గెట్ ఏమాత్రం మిస్ అవదని చెబుతున్నారు.

రవితేజ మార్క్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ గా ధమాకా వస్తుంది. ఈ సినిమా లో రవితేజ డ్యుయల్ రోల్ లో నటించారు. మరి రవితేజ ఎనర్జీ కి సరిగ్గా కుదిరిన ఈ ధమాకా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ మాస్ ఆడియన్స్ ని వావ్ అనిపించేలా చేసే రవితేజ సినిమాల్లో ధమాకా సూపర్ ఫీస్ట్ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి ప్రీ రిలీజ్ సందడి సూపర్ గా ఉంది. మరి సినిమా రీ సౌండ్ ఎలా ఉంటుంది అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సినిమాలో మాస్ రాజా ఫ్యాన్స్ విజిల్స్ వేసే ఎన్నో వావ్ మూమెంట్స్ ఉన్నట్టు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: