టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బబ్లీ బ్యూటీగా మంచి పేరు సంపాదించుకున్న రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరిని అలవలస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం ఈమె యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఈమెకి టాలీవుడ్ హీరోలతో మంచి రాపో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు ఈమెకి సంబంధించిన పర్సనల్ విషయాలను ఏవి కూడా ఈమె బయట పెట్టదు. అయితే తాజాగా రాశి ఖన్నా... నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న

 అన్ స్టాపబుల్ షో లో కనిపించింది. ఇక సీనియర్ హీరోయిన్స్ అయిన జయసుధ, జయప్రద తో కలిసి ఈమె సందడి చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లు బాలకృష్ణ రాశి ఖన్నా ను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలను అడగడం జరిగింది. అయితే ఇప్పుడున్న హీరోలలో మీకు ఎవరు క్రష్ అని బాలకృష్ణ ఆమెను అడగగా ఈమె వెంటనే విజయ్ దేవరకొండ అంటూ చెప్పవచ్చింది. అయితే ప్రస్తుతం రాశి కన్నా  కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో రాశి ఖన్నా మరియు విజయ్ దేవరకొండ కలిసి

 నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి రాశి ఖన్నా లిప్ లాక్ సీన్స్ లలో కూడా నటించడం జరిగింది.అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బబ్లి బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశి కన్నా తన క్రష్ విజయ్ దేవరకొండ అని చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న  ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న ప్రీమియర్ కానుంది. ఇక ఈ వార్త విన్న విజయ్ దేవరకొండ అభిమానులు మరియు రాశి కన్నా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: