సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేము. సినీ ఇండస్ట్రీలో ఏది జరిగిన కూడా అప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీద ఎప్పుడు ఏదో ఒక చర్చలో జరుగుతూనే ఉంటాయి. కమిట్మెంట్ విషయంలో ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది దాన్ని కాస్టింగ్ అంటే మరి కొంతమంది దాన్ని కమిట్మెంట్ అని అంటుంటారు. దర్శక నిర్మాతలకు హీరోలకు ఇచ్చే కెమిట్మెంట్ ల గురించి  నటీనటులు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. 

అయితే తాజాగా  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన తాప్సీ పన్ను కూడా అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు చేసింది.బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఆమె చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే చాలామంది కెమెరా ముందు నటించడం ఒకలాగా ఉంటుంది అని... కెమెరా వెనక నటించడం ఇంకోలాగా ఉంటుంది అని.. ఆమె చెప్పుకొచ్చింది. కెమెరా ముందు కనిపించినంత మాత్రాన వాళ్లు మంచివాళ్లు అని చెప్పలేమని.. తెరవెనక ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు అని చెప్పుకొచ్చింది తాప్సీ పన్ను. తాప్సి ఎలాంటి విషయాన్ని అయినా సరే డైరెక్ట్ గా చెప్పే మనస్తత్వం ఆమెది.

డైరెక్ట్ గా మాట్లాడం వల్ల ఇదివరకు ఆమె అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంది.తాను కెమెరా ముందు మాత్రమే నటించగలను అని తెరవెనక నటించడం తన వల్ల కాదు అని.. తనకి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే వచ్చు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక వెనుక నటించే వాళ్లే ఇండస్ట్రీలో ఎప్పటికీ ముందు వరుసలో ఉంటారు అని వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు వస్తాయని అలా నటించే వారు కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉంటారని.. ఇక తెర వెనుక నటించే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్య ఉంటుంది అని.. షాకింగ్ విషయాలను బయట పెట్టింది తాప్సీ పన్ను.అయితే తాప్సి ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇలాంటి కామెంట్లు చేసింది అనే వార్తలు సైతం  వినిపిస్తున్నాయి.దీంతో తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: