ఈ సంవత్సరం నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో ప్రయోగం చేసి ఆ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరో కొత్త పాన్ ఇండియా హీరోగా మారాడు. కార్తికేయ 2 ఏకంగా 120 కోట్ల పైగా వసూళ్ళు సాధించి స్టార్ హీరోలకి సైతం షాక్ ఇచ్చింది. ఇక తాజాగా నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 18 పేజెస్‌. ఓ మంచి డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. కుమారి 21ఎఫ్ సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీవాస్ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. టీజర్‌, ట్రైలర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.


ఇక ఓపెన్ చేస్తే.. సినిమాలో స్టార్టింగ్ లోనే ప్రేమలో మోసపోయిన యువకుడిగా నిఖిల్ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా పరిచయం చేశారు.ఎంతో స్యాడ్ గా మొదలైన హీరో లైఫ్ హీరోయిన్ రాసిన డైరీ ద్వారా ఎలా హ్యాపీ మోడ్‌లోకి వెళ్లిందనే సీన్స్ నుంచి లవ్‌, ఫన్‌ రాబట్టుకున్నారు. డైరీలో నందిని రాసిన అక్షరాలతో కనెక్ట్ అవుతూ ఆమెకు ఏం జరిగిందో అని నిఖిల్ టెన్షన్ పడే సీన్స్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటాయి. అసలు ఆ నందిని ఎవరో తెలియకుండానే కనీసం ఆమెను చూడకుండానే హీరో నిఖిల్ ప్రేమలో పడటాన్ని చాలా అందంగా డైరెక్టర్ చూపించారు. అయితే యాక్సిడెంట్‌లో నందిని చనిపోయిందనే ట్విస్ట్‌తో సెకండాఫ్‌ఫై చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అసలు ఈ నందిని ఏమైంది? ఆమె ఎక్కడుందో తెలుసుకుంటూ హీరో చేసే అన్వేషణను థ్రిల్లింగ్‌గా నడిపించారు. ఒక్కో ట్విస్ట్ కూడా ఉత్కంఠను పంచుతాయి.ఈ లవ్‌స్టోరీలో  ఆ ఎపిసోడ్‌ను చివరి వరకు ఎంగేజింగ్‌గా నడిపించారు. మొత్తానికి సినిమా చాలా బాగుంది. ఈ సినిమాతో కూడా నిఖిల్ మరో హిట్ కొట్టినట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: