ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.దానికి తోడుగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.ఈ సినిమాసినిమా అనంతరం బాలీవుడ్ లో కూడా బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పుష్ప టు సినిమాపై కూడా మరింత ఫోకస్ లో పెట్టాడు బన్నీ. సినిమా రావడం ఎంత లేట్ అయినా గాని ఔట్పుట్ మాత్రం అస్సలు తగ్గేదేలే అని అల్లు అర్జున్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.

 అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ షూటింగ్ కూడా  ప్రారంభమైంది.  అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన బన్నీకి జోడిగా నటిస్తుంది. అయితే ప్రస్తుతం పుష్ప టు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.  నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా కొరటాలకు అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాని అనంతరం ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో బన్నీ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం కొరటాల జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా స్థాయిలో పెరకెక్కించాలని కొరటాల భారీ ప్లాన్లను చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా పూర్తి కావడానికి మరొక ఏడాదిన్నర సమయం కచ్చితంగా పడుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో అల్లు అర్జున్ ప్రశాంత్  నీల్ తో కూడా ఒక సినిమాలు చేస్తాడు అన్న వార్తలు వినిపించాయి. ఇక దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా లేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన సురేందర్ రెడ్డి తో సినిమా చేయనున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రేసుగుర్రం వంటి సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనతోనే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఈయనని కలిసి కథ కూడా రెడీ చేయమని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త నిజమా కాదా తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఈయన అక్కినేని నిఖిల్ తో ఏజెంట్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: