ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస  సినిమాను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇటీవల సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశాడు సుకుమార్. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పుష్ప సినిమాలో హీరోగా ముందుగా అల్లు అర్జున్ ని అనుకోలేదట సుకుమార్.

ఈ సినిమాకి సంబంధించిన కథను మొదటగా మహేష్ బాబుకి వినిపించాడట సుకుమార్.ఇక కథ విన్నా అనంతరం మహేష్ బాబు ఈ సినిమాకి నో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ సినిమా కథను సుకుమార్ అల్లు అర్జున్ కి చెప్పాడు. అయితే గతంలో సుకుమార్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో ఈ సినిమా కథను మహేష్ బాబుకి చెప్పినప్పుడు మహేష్ బాబుకి ఈ సినిమా కథ సరిగ్గా అర్థం కాలేదట. అయినప్పటికీ సుకుమార్ ఒకటికి రెండుసార్లు ఈ కథను మహేష్ బాబుకు వినిపించి కన్ఫ్యూజ్ చేసి మరి ఈ సినిమాను తీశాడట.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుంది అని భయంతో మహేష్ బాబు ఈ సినిమాకి ఒప్పుకోలేదు అన్న వార్తలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకున్న మనందరికీ తెలిసిందే. బన్నీ నటించిన ఈ సినిమాలో హీరోగా వేరే ఏ స్టార్ హీరో అయినా నటించి ఉంటే ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకునేదా అన్న కామెంట్లు సైతం ఇప్పుడూ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త  ఇప్పుడో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: