
మొదటి భాగంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు రెండవ పార్ట్ కి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. పొన్నియన్ సెల్వన్ - 2 2023 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్రం మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు ప్రముఖ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోంది మొదటి భాగంతో భారీ పాపులారిటీని దక్కించుకున్న డైరెక్టర్ మణిరత్నం ఇప్పుడు రెండవ పార్టుతో ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాడు అని అభిమానుల సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే ఇందులో నటించిన తారాగణం విషయానికి వస్తే ఐశ్వర్యారాయ్, త్రిష హీరోయిన్లుగా నటించగా జయం రవి, విక్రమ్, కార్తీక్, ప్రకాష్ రాజ్, శోభిత దూళిపాల తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పైగా అవుతున్న ఈ సినిమాతోనే త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె రాంగి సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా చెన్నైలో నిర్వహించబోతున్నారు . మొత్తానికైతే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా మరింత విజయాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు.