
కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 84.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి టాప్ 1 స్థానంలో నిలిచింది.
రోబో 2.0 : దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
రోబో : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 36 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
కాంతారా : కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 29.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.
ఐ : టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తేరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. చియాన్ విక్రమ్ ఈ మూవీ లో హీరోగా నటించిన అమీ జాక్సన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.