పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన నటించిన ఆది పురుష్ సినిమాతో పాటు సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితోపాటు ప్రభాస్ సందీప్  దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను కూడా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నా ప్రభాస్ ఇప్పుడు మరో  సినిమాకి కూడా ఓకే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది కూడా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది. 

పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా  క్రేజ్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును పొందాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే వారి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.ఇక ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఈ వార్త వినిపిస్తుంది. అంతేకాదు ఈ వార్త విన్న చాలా మంది నిజంగా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా అనంతరం సుకుమార్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక సుకుమార్ తో ఒక సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన అభిషేక్ అగర్వాల్ అడ్వాన్సులో కూడా ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ నిర్మాణ సంస్థలో ఒక సినిమాను చేయడానికి సుకుమార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల రావడం జరిగింది. ఇక ఇందులో హీరో ఎవరు అన్న సంగతి మాత్రం ఇప్పటిదాకా బయటకు రాలేదు.చాలా రోజుల నుండి దీనికి సంబంధించిన అనేకమైన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ప్రొడక్షన్స్ సంస్థలో సుకుమార్ సినిమా చేయడానికి రెడీ అవ్వడంతో ఈ ప్రాజెక్టు కచ్చితంగా సుకుమార్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త గనుక నిజమైతే వీరి అభిమానుల కు పండగ అని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: