మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అంటే అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నార్త్ లో సల్మాన్.. సౌత్ లో ప్రభాస్. ఇక సల్మాన్ ఖాన్ విషయంలో క్లారిటీ అయితే వచ్చేసింది కానీ డార్లింగ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఇప్పటికే డార్లింగ్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా తర్వాత మ్యారెజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్..ఇప్పటి దాకా మళ్లీ పెళ్లి గురించి మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం చేతినిండా వరుస భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ ను చూసి.. ఇక పెళ్లి చేసుకునేదెప్పుడు అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈమధ్య డార్లింగ్..బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని గాసిప్ రాగా.. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది కృతి. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. మా ఇద్దరి మధ్య అసలు ఎలాంటి ప్రేమ లేదని.. ఏం లేకుండానే అంత గోల చేస్తున్నారని.. ఇప్పటికే కృతి సనన్ కూడా క్లారిటీ ఇచ్చిందని మరోసారి ఆయన గుర్తుచేసారు.


అయితే ఈ షోలో డార్లింగ్ పెళ్లిపై క్లారిటీ మాత్రం వచ్చిందనుకున్న అభిమానులను తన మాటలతో మరోసారి కన్ఫ్యూజ్ చేశారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్న ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 29 వ తేదీన రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో బాల కృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకుంటావా.. లేదా ” అని చాలా గట్టిగా ప్రశ్నించగా ఇందుకు డార్లింగ్ పెళ్లి చేసుకుంటాను సార్ కచ్చితంగా చేసుకుంటాను. కానీ అది ఇంకా రాసిపెట్టలేదేమో.. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. సింగిల్ గా మాత్రం అస్సలు ఉండను.. కానీ ఎప్పుడనేది చెప్పలేను అంటూ సరాదాగా చెప్పుకొచ్చారు ప్రభాస్ డార్లింగ్. దీంతో తమ హీరో మాటలకు బాలయ్యతోపాటు ఇంకా అలాగే ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడ్డారు. అయితే పెళ్లి చేసుకుంటాను.. కానీ ఎప్పుడో అనేది తెలియదు.. ప్రేమలో ఉన్నావా అంటే అలాంటిదేం లేదు అంటూ ప్రభాస్ మాట దాటేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: