బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్.. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని.. జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్ర యూనిట్ ఈ సినిమాను రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ట్రైలర్ ,సాంగ్స్.. ప్రేక్షకులలో సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎంత పాపులారిటీ దక్కించుకుందో అంతే వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. ముఖ్యంగా సినిమా నుంచి మొదటిసారి బేషరమ్ పాటను విడుదల చేయగా.. ఇందులో దీపికా పదుకొనే ఆరెంజ్ బికినీ వేసుకోవడంతో వివాదం చెలరేగింది. అంతే కాదు ఈ సినిమాపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే నిన్నటికి నిన్న సెన్సార్ బోర్డు కూడా షాక్ ఇచ్చింది . తాజాగా పఠాన్ చిత్రం సెన్సార్ కోసం వెళ్లగా సినిమాలో కొన్ని సీన్స్ ను తొలగించాలి అని సెన్సార్ బోర్డు సూచించింది.  దీంతో సినిమాలో వారు తెలిపిన ప్రకారం కొన్ని సీన్స్ ను ముఖ్యంగా దీపిక పదుకొనే బికినీ సీన్స్ అలాగే కొన్ని డైలాగులు మ్యూట్ చేసి మరొకసారి రావాల్సిందిగా సెన్సార్ బోర్డు కోరిందట.దీంతో పఠాన్ మేకర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. అయితే సెన్సార్ బోర్డు సూచించినట్లుగానే కొన్ని సీన్స్ తొలగించి డైలాగ్స్ మ్యూట్ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ అయ్యింది.  కానీ ఇప్పుడు మళ్లీ ఆ పనులు పూర్తి చేసుకొని సెన్సార్ కోసం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలోనే నిన్న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దీపిక బికినీ సన్నివేశాలను కత్తిరించిన పఠాన్ టీం మళ్లీ సినిమాను సెన్సార్ కి పంపినట్లు సమాచారం.  మరి ఈసారైనా సెన్సార్ ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇస్తుందా? అనేది సందేహంగా మారింది.  ఒకవేళ సెన్సార్ బోర్డు మళ్ళీ అభ్యంతరం పెడితే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మరి కొన్ని గంటలు ఆగితే తప్ప సెన్సార్ రిజల్ట్ ఏమిటి అన్నది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: