
ఒక రకంగా చెప్పాలంటే రీ ఎంట్రీ లోనే శృతిహాసన్ కి లక్కు బాగా కలిసి వచ్చింది అన్నది తెలుస్తుంది. రవితేజతో కలిసి క్రాక్ అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అటువెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు యువ హీరోలతో మాత్రమే కాదండోయ్ సీనియర్ హీరోలకు సైతం పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకునేందుకు అటు బాలయ్య, చిరంజీవితో జోడి కట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
కాగా ఇటీవల శృతిహాసన్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు ఒక స్టార్ హీరోకు లవర్ గా నటించిన శృతిహాసన్ ఇక ఇప్పుడు అదే హీరోకి వదినగా నటిస్తుంది అన్నది తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు రవితేజ. ఒకప్పుడు బలుపు సినిమాలో లవర్ గా నటించింది శృతిహాసన్. ఇక గత ఏడాది క్రాక్ సినిమాలో భార్యగా నటించింది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో మాత్రం చిరంజీవి సరసన నటిస్తుండగా.. ఇక రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని టాక్ ఉంది. ఈ లెక్కన చూస్తే శృతిహాసన్ ఇక ఇప్పుడు రవితేజకు వదిన పాత్రలో నటిస్తుంది అని చెప్పాలి.