సినిమా హీరోలకు చాలా మంది అభిమానులు అయితే ఉంటారు. అయితే కొన్నిసార్లు వారి అభిమానాన్ని చాలా కొత్తగా ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోల పుట్టినరోజు వేడుకల సందర్భాలలో అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ అభిమానాన్ని అయితే చాటుకుంటారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ కి కూడా ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తనకు శుభాకాంక్షలు చెప్పడం కోసం పోలీసులతో దెబ్బలు కూడా తిన్నారంటే సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుస్తుంది.

అయితే తమ అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని ఒక అభిమాని చేసిన పనికి సల్మాన్ ఖాన్ ఎంతో ఫిదా అయిపోయారు.ఇంతకీ అభిమాని చేసిన పని ఏంటి అనే సంగతికి వస్తే తన అభిమాన హీరోని కలవడం కోసం మధ్యప్రదేశ్ జబల్ పూర్ కి చెందిన సమీర్ అనే అభిమాని ఏకంగా ముంబైకి సైకిల్ పై ప్రయాణం చేస్తూ తన అభిమాన నటుడు సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఇలా ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1100 కిలోమీటర్లు జర్నీ చేసాడు.. సైకిల్ పై అంత దూరం ప్రయాణం చేసి చివరికి తన అభిమాన హీరోని అయితే కలిశాడు.

ఇక సల్మాన్ ఖాన్ తనని కలవడం కోసం ఐదు రోజులపాటు సైకిల్ పై ప్రయాణం చేసి వచ్చారని తెలియడంతో ఆయన చాలా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సమీర్ తో కలిసి సెల్ఫీలకు కూడా ఫోజులిచ్చాడు. అదేవిధంగా ఆయన ప్రయాణించిన సైకిల్ దగ్గర నిలబడి కూడా ఆయన ఫోటోలు దిగారు. ఇలా తనకోసం అంత కష్టపడి వచ్చిన అభిమానిని ఏమాత్రంకూడా నిరాశపరచకుండా సల్మాన్ ఖాన్ తనతో నవ్వుతూ మాట్లాడారు.తాను సల్మాన్ ఖాన్ ను దేవుడితో సమానంగా భావిస్తానని చెప్పడమే కాకుండా సల్మాన్ ఖాన్ కి తాను పిచ్చ అభిమానిని అంటూ కూడా తన అభిమానాన్ని అయితే చాటుకున్నారు. మొత్తానికి సమీర్ సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: