ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే దుబాయిలో న్యూయార్క్ వేడుకలను తన స్నేహితుల మధ్య జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. షూటింగ్స్ కూడా లేకపోవడంతో పూజా హెగ్డే ఎక్కువగా ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాలలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతోంది. ఇక త్వరలోనే మహేష్ బాబు సినిమా షూటింగ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది అయితే నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.

గత సంవత్సరం పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్ని వరుస ప్లాప్ అయ్యాయి  ఇప్పుడు పూజా హెగ్డే ను కాపాడే బాధ్యత త్రివిక్రమ్, మహేష్ మీదే ఉందని చెప్పవచ్చు. కేవలం పూజా హెగ్డే కెరియర్ ఈ సినిమాతోనే తేలిపోతుంది. సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ చేసినప్పటికీ ఆ సినిమా కూడా బాలీవుడ్లో ప్రస్తుతం ఆకట్టుకోలేక పోతోంది. వరుసగా అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అల వైకుంఠపురం, మహర్షి వంటి సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ నటించి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు సైతం లక్కీ హీరోయిన్గా మారింది.

 2022లో ఈమెకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఒక్కసారిగా ఫ్లాపులన్నీ ఇమెను చుట్టూ ముట్టాయి. దీంతో ఈమె పైన నెగటివ్ టాక్ కూడా రావడం జరిగింది. రాదే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి ఈమె బయటపడే లోపు ఆచార్య సినిమాతో దెబ్బ పడింది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎఫ్ 3 సినిమాల స్పెషల్ సాంగ్ లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో ఈ సినిమా కూడా నష్టాలని మిగిల్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏడాది బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: