మెగా ఫ్యామిలీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ లో 'తొలిప్రేమ' అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తన యాక్టింగ్ స్కిల్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా కూడా ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ గా అనే చెప్పాలి. 

ఇంక సినిమాలో యూత్ కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉండడం.. అవి కూడా బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని సైతం అందుకుంది. ఇక సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశి కన్నా కథానాయికగా నటించగా.. ఆమె కూడా సినిమాలో తన అందం తో పాటు పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో వరుణ్ తేజ్ రాశిఖన్నా మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అప్పటివరకు రాశి కన్నా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన.. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఏమి చేయలేదు. కానీ తొలిప్రేమ సినిమాలో గ్లామర్ తో పాటు అద్భుతమైన నటనను కనబరిచింది. ఇదిలా ఉంటే దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ ను సంప్రదించాడట.

 కానీ ఆ సమయంలో ఆమె కాస్త బొద్దుగా ఉండడంతో ఆమెని తీసుకోలేదట. మెహరీన్ చాలా బొద్దుగా ఉండడంతో ఈ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇక ఆమె స్థానంలో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నాడు వెంకీ అట్లూరి. ఇక సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవడం తో మెహరీన్ ఒక్కసారిగా రియలైజ్ అయి జిమ్ కెళ్ళి వర్కౌట్ చేసి మరి సన్నబడిందట. ఇక టాలీవుడ్లో నాచురల్ స్టార్ నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే సినిమాతో హీరొయిన్ గా అరంగేట్రం చేసిన మెహరీన్. ఆ తర్వాత జవాన్, మహానుభావుడు, రాజా ది గ్రేట్,ఎఫ్2 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇక గత సంవత్సరం ఎఫ్3 సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తోంది. మొత్తం మీద తొలిప్రేమ సినిమా వల్ల  మెహరీన్ కి జ్ఞానోదయం అయిందన్నమాట. అన్నట్టు మెహరీన్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఈ మధ్య ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: