టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ వరుసగా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకు వెళుతున్నాడు. ఇక నిఖిల్ కెరీర్ ను మరో రేంజ్ కు పెంచిన సినిమాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి.ఇక రీసెంట్ గా ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా హిందీలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో సరదాగా కేవలం ఒక 50 థియేటర్లలో విడుదల చేస్తే రెండవ రోజుకి ఆ సంఖ్య వందల సంఖ్యలో పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వేల సంఖ్యలోకి  పెరిగింది. ఆ విధంగా కార్తికేయ 2 సినిమాకు దేశవ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ సినిమా టెలివిజన్లో కూడా అదే రేంజ్ లో మంచి గుర్తింపు అందుకోవడం విశేషం.ఈ మధ్య విడుదల చేసిన టాప్ టీవీ ప్రీమియర్ రేటింగ్స్ లలో సౌత్ ఇండియన్ డబ్బింగ్ సినిమాల నుంచి కార్తికేయ 2 టాప్ లిస్టులో నిలిచింది.


ఈ లిస్టులో ఫస్ట్ అత్యధిక రేటింగ్ అందుకున్న సినిమాగా rrr సినిమా నిలిచింది. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో 4.35 రేటింగ్ తో పుష్ప సినిమా ఉండగా 3.84 రైటింగ్ తో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా నిలిచింది. ఇక వీటి తర్వాత 1.7 రేటింగ్ తో నాలుగో స్థానంలో కార్తికేయ 2 సినిమా నిలిచింది.ఇక ఈ సినిమాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాదేశ్యామ్ 1.45 రేటింగ్ తో నిలిచింది. తరువాత లైగర్ సినిమాకు కూడా అదే  రేటింగ్ వచ్చింది. టాప్ లిస్టులో అత్యధిక టిఆర్పి రేటింగ్ అందుకున్న డబ్బింగ్ సినిమాలలో సౌత్ ఇండస్ట్రీ నుంచి కార్తికేయ 2 నాలుగో స్థానంలో నిలవడం నిజంగా విశేషం. ఇక లైగర్ సినిమా తర్వాత ఏడవ స్థానంలో వలిమై సినిమా 1.08 రేటింగ్ తో ఉంది. 8వ స్థానంలో 0.87 రేటింగ్ తో కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఉంది. ఇక ఆ తర్వాత తొమ్మిదవ స్థానంలో శేష్ మేజర్ సినిమా 0.73 రేటింగ్ దక్కించుకుంది. తరువాత విక్రాంత్ రోణ 0.70 రేటింగ్ అందుకొని టాప్ టెన్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: