టాలీవుడ్లో హీరోయిన్ కీర్తి సురేష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోమ్లీ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఇమేజ్ ను కూడ సొంతం చేసుకుంది.ముఖ్యంగా నటనపరంగా కీర్తి సురేష్ కు తిరుగులేని స్టార్ డం సంపాదించిన సినిమా మహానటి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉండడంతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ వైపు మళ్ళింది.కీర్తి సురేష్ పలు చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ ఎప్పుడూ కూడా తన హద్దు దాటి అందాల ఆరబోత చేయలేదు. ముఖ్యంగా నటన ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది కీర్తి సురేష్. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ థాయిలాండ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయక ఇందులో స్విమ్మింగ్ పూల్ లో తన తడి అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది.ముఖ్యంగా పలు ప్రాంతాలలో తన గ్లామర్ తో చూపిస్తూ మైమరిపించేలా చేస్తోంది కీర్తి సురేష్. గత సంవత్సరం సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ కు జోడిగా నటించింది. కీర్తి సురేష్ ను ఈ చిత్రంలో మరింత అందంగా ప్రజెంటేషన్ చేశారు డైరెక్టర్ పరుశురామ్. మహేష్ తో కలిసి కామెడీ టైమింగ్ కూడా కీర్తి సురేష్ చాలా అద్భుతంగా చేసింది. తాజాగా బీచ్ దగ్గర ఉండేటువంటి కొన్ని ఫోటోలతో పాటు తన అందాలను చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: