కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ ఆఖరుగా వలిమై అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

బోనీ కపూర్ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా వలిమై లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత అజిత్ "తునివు" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని బోనీ కపూర్ నిర్మించాడు.

మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తెగింపు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తమిళ్ మరియు తెలుగు ప్రచార చిత్రాలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా ... వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలలో జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 25 నిమిషాల 48 సెకండ్ ల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: