
అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొడితే ఆ హీరోయిన్ కు అవకాశాలు ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. అయితే కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టింది శ్రీనిధి శెట్టి. అంతకుముందు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక 2016లో మిస్ నేషనల్ ఇండియా టైటిల్స్ అందుకుంది శ్రీనిధి. కే జి ఎఫ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుని మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ కొట్టేసింది. ఆ తర్వాత ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఇలా పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టిన ఈ అమ్మడిని మాత్రం దర్శక నిర్మాతలు ఎవరు పట్టించుకోవడం లేదు అని తెలుస్తుంది.
కే జి ఎఫ్ తర్వాత విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయింది. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ భామ కెరియర్ డైలమాలో పడిపోయిందట. అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుందట.. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఓ సీనియర్ హీరోకి కమిట్ అయిందట శ్రీనిధి. ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. హిట్ సీక్వల్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శైలేష్ కోలనుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకటేష్. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుందట. ఇలా అవకాశాలు లేక చివరికి సీనియర్ హీరోతో రొమాన్స్ కి కూడా సిద్ధమైంది కేజిఎఫ్ భామ.