అలనాటి హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయం సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈమె. దాని అనంతరం చాలా సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సదా మాట్లాడుతూ అపరిచితుడు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.. విక్రమ్ కి తనకు మధ్య ఉన్న చాలా సన్నివేశాలు నేను బాగా ఎంజాయ్ చేశాను ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చాలా అద్భుతంగా ఉండేవి అని. ఆ సీన్ అయిన  వెంటనే విక్రం తనను చెల్లి అని చాలా ప్రేమగా పిలిచేవాడట.. 

నేను కూడా విక్రమ్ నిఅన్నయ్య అని పిలిచేదాన్ని.. అలా రొమాంటిక్ సీన్ల అనంతరం మేమిద్దరం అన్నా చెల్లి అని పిలుచుకోవడంతో ఒక్కసారిగా సెట్లో ఉన్న వాళ్ళు అందరూ పడి పడి నవ్వారు..అంటూ చెప్పుకొచ్చింది సదా. అయితే విక్రం ఇంకా నేను అన్న చెల్లెలు అని పిలుచుకుంటామని ఏ సినిమా డైరెక్టర్ శంకర్ కి తెలియదు. తెలిసిన అనంతరం మాపై ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ఇక అప్పుడు మమలిద్దరిని తిట్టారు. మీరు అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ..మీరు ఎలా ఒకరినొకరు అన్న చెల్లెలు అని పిలుచుకోవడం ఏమాత్రం బాగాలేదు..ఈ విషయం బయట జనాలకి తెలిస్తే ఈ సినిమా చూసేటప్పుడు స్క్రీన్ మీద మీ ఇద్దరినీ అన్నా చెల్లెల లాగానే చూస్తారు..

భావన ప్రేక్షకుల్లో కలగడం మంచిది కాదు.. అంటూ ఇద్దరినీ హెచ్చరించారట. ఇక అపరిచితుడు సినిమాలో ని ఈ విషయాలను పంచుకుంది హీరోయిన్ సదా. ఇక సదా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది సదా. ప్రస్తుతం సదా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. అంతేకాదు సదా మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తే చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఇంత వయసు వచ్చినప్పటికీ సింగిల్గానే ఉండడంతో ఈమె అభిమానులు సదా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటున్న అని ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే సరైన కథ మరియు తనకి సెట్ అయ్యే క్యారెక్టర్ దొరికితే కచ్చితంగా మళ్ళీ సినిమాలు చేస్తూ అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ సదా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: