పాన్ ఇండియా ఇండియా స్టార్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అత్యంత భారీ బడ్జెట్‌ ఇంకా అలాగే భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ విడుదల వరకు ఎలాంటి అంచనాలు రాలేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్‌ విడుదల అయ్యిందో ఈ సినిమా గురించి ఓ రేంజ్‌లో చర్చ అనేది జరిగింది. ఎందుకంటే ఈ టీజర్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా సీన్స్ ఉన్నాయంటూ కొంతమంది ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక అలాగే మరికొంతమంది ఈ మూవీ టీజర్‌ అస్సలు బాలేదని ఇంకా ఇదేదో అచ్చం యానిమేషన్‌ మూవీలాగా ఉందంటూ కూడా చాలా భారీగా ట్రోలింగ్ చేశారు.దీంతో ఈ సినిమా అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రాఫిక్‌ పనులను సక్రమంగా జరుపుకుంటోన్న ఈ సినిమా తాజాగా మరోసారి వివాదంలో నిలిచింది.  


తాజాగా అలహాబాద్ హైకోర్టు ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సమాధానం కోరింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డ్‌కు నోటీసులు జారీ చేయడం జరిగింది.సెన్సార్‌ బోర్డ్‌ నుంచి సర్టిఫికెట్‌ ని పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్‌ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇంకా అంతేకాంకుడా సీత పాత్రలో నటించి కృతి సనన్ ధరించిన కాస్ట్యూమ్స్‌పై కూడా ఈ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వివరాలను కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్ట్‌ కేసు తరువాతి విచారణ ఫిబ్రవరి 21 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి ఇక కోర్టు ఎటువంటి తీర్పునిస్తుంతో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: