సినిమా హీరో హీరోయిన్లు ఎవరితో అయినా కలిసి మీడియా కంటపడ్డారు అంటే చాలు ఇక వారికి ప్రేమాయణం అంటగడుతూ ఉంటారు అందరూ. ఇక రెండు మూడుసార్లు ఇలా కెమెరా కంట పడితే వారి మధ్య ఏదో ఉందని అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు అని చెప్పాలి. దీంతో వారికి సంబంధించిన వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.


 మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా భాటియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు దశబ్ద కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ... ఇప్పటికే అందరూ స్టార్ హీరోల సరసన నటించింది.. ఎన్నో బ్లాక్బస్టర్లను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక అదే సమయంలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు ప్రేమలో పడిందా అంటే గత కొంతకాలం నుంచి అవును అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.


 ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో తమన్న ప్రేమాయణం నడుపుతుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో ఈ ఇద్దరు కలిసి కనిపించడం.. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. గోవాలో న్యూ ఇయర్ పార్టీలో పాల్గొన్నారు. ఇక తమన్నా విజయ్ వర్మ కిస్ చేసుకుంటూ ఎంతో సన్నిహితంగా కనిపించారని చెప్పాలి. ఇక ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్టులో కూడా ఇద్దరు ఒకేసారి కలిసి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే నిన్న బాలీవుడ్ లో ఒక అవార్డు వేదికకు హాజరైంది తమన్న.  రెడ్ కార్పెట్ పై కెమెరాకు ఫోజులు ఇచ్చింది. అయితే అటుపక్కగా వెళ్తున్న విజయవర్మ తమన్నా ఫోటోషూట్ ను కావాలని డిస్టర్బ్ చేస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత తమన్న విజయవర్మను పిలిచి మరి ఇక ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇక వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ మరి డీప్ గా ఉంది అంటూ అందరూ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: