
అయితే మెగాస్టార్ నటించిన రెండు సినిమాల మధ్య గ్యాప్ వంద రోజులు లేకుండా సినిమా వచ్చిన సందర్భం కేవలం 1990లో ఒక్కసారి మాత్రమే జరిగింది. ఇక తర్వాత ఎప్పుడూ కూడా 100 రోజుల గ్యాప్ లేకుండా చిరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈసారి అలా వస్తుండడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ తుఫాను కొనసాగుతూనే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. తక్కువ గ్యాప్ తోనే విడుదలవుతూ ఉండడంతో ఇక సినిమాను ఎంజాయ్ చేయొచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఏకంగా అక్కినేని యువ హీరో కోసం ఇలా వెనకడుగు వేస్తున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇలా బోలా శంకర్ వాయిదా వెనుక అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలకు నిర్మాత అనిల్ సుంకర అన్న విషయం తెలిసిందే. బోలా శంకర్ లో కె ఎస్ రామారావు భాగస్వామ్యం ఉంది. కానీ బిజినెస్ వ్యవహారాలను మొత్తం చూసుకుంటుంది అనిల్ సుంకర కావడం గమనార్హం. ఏజెంట్ సినిమా ఇప్పటికే విపరీతంగా లేట్ అయింది. దీంతో ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాత అనిల్ సుంకర డిసైడ్ అయ్యారట. అదే సమయంలో ఇక బోలా శంకర్ విడుదల చేస్తే నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో తడబడే అవకాశం ఉంది. ఇక ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడితే నష్టాలు తప్పవు. అందుకే అఖిల్ ఏజెంట్ కోసం ఇక బోలా శంకర్ ను ఒక నెల గ్యాప్ తర్వాత విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.