ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ హిట్ అందుకున్న రాజమౌళి ఎలా అయినా ఆర్ఆర్ఆర్ సినిమాకి ఒక్క ఆస్కార్ అవార్డు అయినా తీసుకురావాలని ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.సినిమా విడుదల చేసినప్పుడు ఈ ఆస్కార్ వస్తుందో? లేదో? అని అంచనాలు అసలు ఎవరికీ లేవు.అయితే రికార్డు వసూళ్లు వస్తాయని అంచనాలు వున్నాయి.అయితే మరీ బాహుబలి రేంజిలో రాకపోయినా బాగానే వచ్చాయి. కానీ రివ్యూస్ మాత్రం ఇంటర్నేషనల్ రేంజిలో వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా.ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలోనే ఉండి సినిమాని ప్రమోట్ చేస్తున్న నేపథ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక ఆస్కార్ అవార్డు అయిన సినిమాకి తీసుకురావాలని లక్ష్యంతో వారంతా కూడా చాలా కష్టపడుతున్నట్లుగా సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో పలు ఫేమస్ అవార్డులు అందుకున్నా సరే ఆస్కార్ అవార్డు కోసమే టీం ఇంకా అక్కడ ఎంతగానో వెయిట్ చేస్తోంది.మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇంకా ఎన్టీఆర్ వంటి వారు వెనక్కి వచ్చేసినా రాజమౌళి అండ్ టీం మాత్రం అక్కడే ఉండి తమ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అందరం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.


అయితే తాజాగా  రాజమౌళిని ఇక్కడ సినిమా చేస్తే చెప్పాలని కలిసి మాట్లాడదామని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.దీంతో రాజమౌళి మహేష్ నుంచి వస్తున్న సినిమా మీద ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో చాలా గ్రాండ్ గా చేస్తున్నాం, ఆ సినిమాకు హాలీవుడ్ రేంజ్ స్టోరీ ఇస్తున్నాం అంటూ ముందు నుంచి అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అయితే గాల్లో తేలిపోతున్నారు. రాజమౌళి చేసే కథ మహేష్ కెరీర్ లోనే చాలా పెద్ద హిట్ అవుతుందని రికార్డులు బద్దలు కొడుతుందని మహేష్ ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమాతోనే నెంబర్ 1 గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో చేసిన సినిమాలన్నింటిలోకి కూడా టాప్ గా నిలుస్తుందని ఇంకా అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ ల్లో సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: