టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. ఈ మధ్యకాలంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాలేవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ మధ్య కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వా నటించిన 'ఆడాళ్లు మీకు జోహార్లు' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత నటించిన 'ఒకే ఒక జీవితం' సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. కానీ ఒక కమర్షియల్ హిట్ మాత్రం శర్వానంద్ కి ఈ మధ్యకాలంలో లేనేలేదు. ఈ క్రమంలోనే శర్వానంద్ తన తదుపరి సినిమాని ఎవరితో చేస్తారనే విషయం సర్వత్ర ఆసక్తిని రేకత్తిస్తుండగా.. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడట.

అతను మరెవరో కాదు శ్రీరామ్ ఆదిత్య. 'భలే మంచి రోజు' సినిమాతో ప్రామిసింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీరామ్.. ఆ తర్వాత శమంతకమణి, దేవదాసు, హీరో వంటి సినిమాలు చేసి ప్లాప్ డైరెక్టర్గా మిగిలిపోయాడు. ఇక ఈ డైరెక్టర్ చివరిగా తీసిన 'హీరో' సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత శ్రీరామ్ కి ఇంకో అవకాశం కష్టమే అని అనుకుంటున్న సమయంలో శర్వానంద్ ఇప్పుడు అతనితో సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయబోతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అవ్వగా రీసెంట్ గా మూవీ యూనిట్ లండన్ వెళ్లి లొకేషన్స్ కూడా చూసి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందట.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్, కృతి శెట్టి కలయికలో రాబోతున్న మొదటి సినిమా ఇదే. అటు కృతి శెట్టి కూడా ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఆమె నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి వరుస సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. ఇలాంటి సమయంలో శర్వానంద్ తో ఈ అమ్ముడు జతకడుతోంది. అటు శర్వానంద్ కి ఇటు కృతి శెట్టికి ఈ సినిమా హిట్ చాలా ముఖ్యం. మరి ప్లాప్ డైరెక్టర్ తో శర్వానంద్ ఈసారైనా గట్టెక్కుతాడా? లేదా అనేది చూడాలి. అన్నట్టు శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే కదా. త్వరలోనే ఈ హీరో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: