విశ్వ నటుడు కమల్‌ హాసన్‌, కోలీవుడ్ గ్రేట్‌ డైరెక్టర్‌ మణిరత్నం కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల తరువాత ఓ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం కమల్‌తో పాటు మణిరత్నం కూడా సూపర్ ఫామ్‌లోకి తిరిగి రావడంతో ఈ ప్రాజెక్ట్ మీద ఎన్నో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.ఇక అందుకు తగ్గట్టుగా పెద్ద కాస్టింగ్‌తో భారీగా మూవీని ప్లాన్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత విక్రమ్ తో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు కమల్ హాసన్‌. 60 పైగా వయస్సులో కూడా యాక్షన్ హీరోగా కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ కమల్‌ హసన్ మీద కోలీవుడ్ మేకర్స్‌ లో విపరీతంగా కాన్ఫిడెన్స్ పెంచింది. అందుకే సూపర్ డైరెక్టర్ మణిరత్నం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తరువాత కమల్‌ హాసన్ తో మూవీకి రెడీ అవుతున్నారు.ప్రస్తుతం మణిరత్నం కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సూపర్ హిట్ అయ్యింది.


ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు మణిరత్నం.ఇక పీఎస్‌ 2 రిలీజ్ అయితే కమల్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ రెడీ అవుతుంది. 1987 వ సంవత్సరంలో కమల్‌ హాసన్ మణిరత్నం కాంబినేషన్‌లో నాయకుడు సినిమా రిలీజ్ అయ్యింది. మణి టేకింగ్ ఇంకా కమల్‌ అద్భుతమైన నటనతో ఈ సినిమా ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటింది. అప్పట్లోనే ఆస్కార్‌ బరిలో నిలిచే సత్తా ఉన్న గా పేరు తెచ్చుకుంది నాయకుడు మూవీ.మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత కమల్‌ హాసన్ ఇంకా మణి రత్నం కాంబినేషన్‌ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఆ అంచనాలను రీచ్‌ అయ్యే రేంజ్‌ లో నటినటులను ఎంపిక చేస్తున్నారు మణి రత్నం. కమల్‌ హాసన్ తో పాటు ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇంకా బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: