
ఉర్ఫీ జావేద్ నటనా ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమె ఫ్యాషన్ గేమ్ ను మొదలు పెట్టింది. ఆమె అనతికాలంలోనే సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారింది. ఉర్ఫీ జావేద్ డ్రెస్ వేసిదంటే ముంబై నగరం మాత్రమే కాదు సోషల్ మీడియా లో ప్రపంచం మొత్తాన్ని తనపైకు తిప్పుకుంటోందటా.. తన దైన తరహాలో అలజడి సృష్టిస్తుంది.. నటి మరోసారి తన ఫ్యాషన్ గేమ్‌ను పెంచేసింది.. ఈసారి ఉర్ఫీ తనలోని క్రియేటివిటీ కి మరింత మెరుగులు అద్దింది. తనను ట్రోల్ చేసేవారితో కూడా శభాష్ అని అనిపించుకుంటోంది.
ఉర్ఫీ జావేద్ సైకిల్ చైన్ మరియు నెమలి ఈకలు, మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్, గాజు ముక్కలు వంటి అనేక వస్తువులతో దుస్తులను తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి డస్ట్‌బిన్ బ్యాగ్ డ్రెస్ ను వేసుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన వీడియోను కూడా షేర్ చేసింది. దీనిలో నటి నల్లటి డస్ట్‌బిన్ బ్యాగ్ దుస్తులు ధరించడాన్ని ఇప్పుడు మనం చూడవచ్చు. డస్ట్‌బిన్ బ్యాగ్‌లతో ఆమె రెండు రకాల డ్రెస్‌లను తయారు చేసింది. ఆమె 'బిగ్ బాస్ OTT' లో కూడా ఈ రకమైన దుస్తులను ధరించింది.
ఉర్ఫీ జావేద్ డస్ట్‌బిన్ బ్యాగ్ డ్రెస్ ధరించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఆ తర్వాత ఇలా రాసింది. "నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు, నేను డస్ట్‌బిన్ బ్యాగ్ డ్రెస్ ను తయారు చేసాను. చరిత్రను పునరావృతం చేద్దాం అని చూసాను.' అని ఆ నటి పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. 'నేను దీన్ని అక్షరాలా రెడ్ కార్పెట్‌పై కూడా ధరించగలను అని తమాషా కాదు. కోమల్ పాండే స్ఫూర్తితో నేను బిగ్ బాస్‌లో అసలు డస్ట్‌బిన్ బ్యాగ్ దుస్తులను తయారు చేశాను అని చెప్పింది .
ఉర్ఫీ జావేద్ తరచుగా తన దుస్తులపై విమర్శలకు అయితే గురవుతుంది. ప్రజలు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తారు. కానీ ఈసారి దానికి విరుద్ధంగా ఉంది. నటి ఈ దుస్తులను ట్రోలర్లు కూడా బాగానే ఇష్టపడ్డారు. తన డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ప్రశంసలు అందిస్తున్నారు.