టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నట సింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.ఇక వీరరసింహా రెడ్డి సక్సెస్ మీట్‏లో  నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్‍లో ఏఎన్ఆర్..ఎస్వీ రంగారావులను ఉద్దేశిస్తూ బాల కృష్ణ మాట్లాడిన మాటలపై ఇప్పటికే అక్కినేని వారసులు నాగచైతన్య ఇంకా అఖిల్ సీరియస్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో నందమూరి.. అక్కినేని ఫ్యాన్స్ మధ్య బిగ్ వార్ మొదలైంది. ఇక బాల కృష్ణ చేసిన మాటలపై సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఆర్ కుటుంబానికి క్షమపణలు చెప్పాలంటూ భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు. తమ ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా ఇలా కామెంట్స్ చేస్తే సహించేది లేదని.. ఆ కుటుంబానికి బాల కృష్ణ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.


ఇక బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య ఇంకా అక్కినేని అఖిల్‌ రియాక్ట్ అయ్యారు. ఇద్దరూ కూడా వేర్వేరు పేర్లతో ఒకే సందేశాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఇంకా రంగారావు కళామతల్లి ముద్దుబిడ్డలనీ, అలాంటి నటులను అవమానించటం అంటే మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ఒక ప్రకటనని విడుదల చేశారు. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ మాట్లాడే బాలకృష్ణ- పొరపాటుగా అన్నాడో లేక నోరుజారారో తెలియదుగానీ, ఇలా టాలీవుడ్‌ లెజెండరీ హీరోలపై కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. ‘అక్కినేని…తొక్కినేని, ఆ రంగారావు…ఈ రంగారావు’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. మేం ఎప్పుడు కలిసినా కూడా వాళ్లపైనే ఇలా టైంపాస్‌ డిస్కషన్స్‌ చేస్తాం అంటూ నోరు జారారు బాలయ్య.ప్రస్తుతం బాలయ్యని నెటిజన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.అక్కినేని కుటుంబానికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ బాలయ్యని డిమాండ్ చేస్తున్నారు.మరి బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: