ప్రముఖ కమెడియన్ గా.. హీరోగా.. ఇప్పుడు విలన్ గా నటిస్తూ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా మోస్ట్ వాంటెడ్ విలన్ గా చలామణి అవుతున్నారు. ఒకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా మరొకవైపు శివ కార్తికేయ నటిస్తున్న సినిమాలో కూడా సునీల్ విలన్ గా నటించడానికి సంతకం చేశారు. ఇకపోతే సునీల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా హీరోగా చేసినప్పుడు కోటి రూపాయల కంటే ఎక్కువ పారితోషకం తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సునీల్ జైలర్ సినిమాలో నటిస్తున్నందుకుగానూ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీన్నిబట్టి చూస్తే టాలీవుడ్లో కంటే కోలీవుడ్లో ఈయనకు ఎక్కువ క్రేజ్ లభిస్తుంది అని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కామెంట్ల విషయానికి వస్తే లేడీ సూపర్ స్టార్ నయనతార బాటలో సునీల్ నడవబోతున్నాడు అని స్పష్టం అవుతుంది.  అసలు విషయం ఏమిటంటే నయనతార తాను నటించే ఏ సినిమాకి కూడా ప్రమోషన్స్ చేయడానికి ఇష్టపడదు ఇప్పుడు ఇదే బాటలో సునీల్ నడవబోతున్నాడట.


ఫిలిం మేకర్స్ చెబుతున్న విషయానికి వస్తే.. చిన్న సినిమాలలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సునీల్ ఆ సినిమాలకు ప్రమోషన్స్ చేయడానికి రాడు అని.. సినిమా కథ వినేటప్పుడే ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న బడ్జెట్ చిత్రాల ప్రమోషన్స్ కి తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాను అని నిర్మాతలతో చెబుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా సునీల్ క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చిన్న బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ కి రావడానికి ఇష్టపడడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: