టాలీవుడ్ లో ఉన్న అగ్రహీరోలు చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున మరియు బాలకృష్ణల నుండి ఎటువంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు ఆదరిసిన్హాడానికి ఎపుడూ సిద్ధంగా ఉంటారు. కానీ కథ కొంచెం ఎంటర్టైనింగ్ గా రెండున్నర గంటల పాటు సరదాగా సాగిపోతే చాలు. ఇక ఇటీవల సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణల వీరసింహారెడ్డి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల కలెక్షన్ లను కొల్లగొడుతున్నాయి. అయితే నాగార్జున మరియు వెంకటేష్ ల నుండి ఇంకా కొత్త సినిమాలు రాలేదు. వెంకటేష్ అయితే ఆఖరిగా ఎఫ్ 3 తో మన ముందుకు వచ్చి సక్సెస్ ను అందుకున్నాడు.

అంతకు ముందు తమిళ రీమేక్ నారప్ప తో యాక్షన్ మూవీ చేసి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా విక్టరీ వెంకటేష్ నుండి మరో యాక్షన్ థ్రిల్లర్ రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టైటిల్ ను 'సైంధవ్' గా నామకరణం చేశారు, ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్సె కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకు హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేశు కొలను దర్శకత్వం వహిస్తుండడం విశేషం. మొన్ననే అడవి శేష్ తో హిట్ 2 తో బంపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ సినిమా ఫలితం మూలంగానే వెంకటేష్ తో సినిమా చేసే సువర్ణావకాశాన్ని అందుకున్నాడు. శైలేశు సినిమాలు ఎలా ఉంటాయి అని ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. పైగా హిట్ 2 తర్వాత అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.

ఇక గ్లింప్సె లో చూపించిన విధంగా సినిమా ఒక మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కూడా ఫుల్ మాస్ అవతారంలో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని ఉన్నాడు. అయితే సినిమాలో నటించే ఇతర పాత్రల గురించి ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో వెంకటేష్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నాడని తెలుస్తోంది. మరి ఇందులో ఎటువంటి నిజం ఉందొ తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: