రీసెంట్ గా 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో మెగాస్టార్ మెగా కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఆయన ఫ్యాన్స్ ఎంతగానో సంబరపడుతున్నారు.ఈ క్రమంలో ఆయన తరువాత చేయబోయే చిత్రం 'భోళా శంకర్'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాకి పోటీగా అక్కినేని వారసుడు అఖిల్ సినిమా విడుదలవుతుండటం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అఖిల్ అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. 


ఎట్టకేలకు ఈ సినిమాకి కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఏప్రిల్ 14 వ తేదీని 'భోళా శంకర్' సినిమా లాక్ చేసుకుంది.మరి ఆ సినిమాకి పోటీగా 'ఏజెంట్'ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారా  అనేది తెలియాల్సి ఉంది. పైగా ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతుండటం విశేషం. ఇటీవల movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కూడా తాము నిర్మించిన రెండు పెద్ద సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'లను ఒకేసారి కేవలం ఒక రోజు గ్యాప్ లో విడుదల చేసి ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.ఇక అఖిల్ ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నాడు.కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్టు లేక సఫర్ అవుతున్న అఖిల్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ని ఇస్తుందో చూడాలి. అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా బాక్స్ వద్ద ప్లాప్ గా మిగిలాయి. ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ హిట్ కొడతాడో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: