గీతగోవిందం సినిమాను డైరెక్ట్ చేసిన పరుశురాం పేరు ఇండస్ట్రీలో ఒక రేంజిలో వినపడింది.. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడు.  సర్కారీ వారి పాట సినిమా తీసి మరో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా ఏకంగా 200 కోట్ల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక గీత గోవిందం 2 సినిమా సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్ . యధావిధిగా గీత బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మించాలని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యాడు. ఇక డైరెక్టర్ కూడా అందుకు ఓకే చెప్పాడు .. అంతే కాదు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ప్లాన్ మార్చేసి ఈ మ్యాటర్లోకి దిల్ రాజు ఇన్వాల్వ్ అయ్యాడు . దీంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ కి తిక్క రేగింది. రాత్రికి రాత్రి మరో భారీ టెంప్టింగ్ ఆఫర్ తో పరశురాంను లైన్ లో పెట్టేసి అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేశాడు దిల్ రాజు.


అలాగే దీనికి విజయ్ దేవరకొండ కూడా సహకరించాడు. అల్లు అరవింద్ కు కోపం పెరిగిపోయి. నా దగ్గర డబ్బులు తీసుకుని అతగాడి దగ్గర కమిట్మెంట్ ఇస్తావా అంటూ ఒక రేంజిలో ఫైర్ అయిపోయాడు . ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అడిగి పారేయాలి అనుకున్నాడు. తీరా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు కొంతమంది ఆయనకి ఫోన్ చేయడంతో మ్యాటర్ కూల్ అయింది.అయితే పరశురామ్ దిల్ రాజుతో కమిట్ అయ్యి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని పెట్టి గీతగోవిందం 2 తెరకెక్కించబోతున్నారు. అయితే గతంలో అల్లు అరవింద్ కోపానికి గురైన ఓ స్టార్ హీరో కూడా ఇలాగే ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ హీరో ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే అల్లు అరవింద్ తలచుకుంటే ఏమైనా చేయగలడు.. ఆయన కోపానికి గురైతే ఎవ్వరైనా ఇబ్బంది పడాల్సిందే అంటూ అల్లు ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: