యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బంధం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే పేరుతో ప్రకటించింది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు.

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి చియాన్ విక్రమ్ ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి సైఫ్ అలీ ఖాన్మూవీ లో కీలక పాత్రలలో నటించబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ఇద్దరు నటులతో ఈ మూవీ యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ వార్తకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 వ తేదీ నుండి లేదా అంత కన్నా ముందే ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ పార్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ యొక్క అత్యధిక షూటింగ్ ను హైదరాబాద్ ... గోవా ... విశాఖపట్నంలో భారీ సెట్ లను వేసి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 9 భాషలలో విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: