సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఇప్పటి వరకు ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ సినిమాగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం జరుగుతుంది.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లు అయినటు వంటి పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను త్రివిక్రమ్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు ... అలాగే ఈ మూవీ లో చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 20 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న తారాగణం పై చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్.లో రూపొందిన అతడు ... ఖలేజా మూవీ లు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: