సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ను చాలా ఇష్టపడుతూ ఉంటారు. సినీ అభిమానులు కొన్ని కాంబినేషన్ల కోసం వారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ  ప్రేక్షకులు సైతం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి ఒక కాంబినేషన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో అతడు ఖలేజా వంటి సినిమాలు వచ్చి ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనందరికీ తెలిసిందే .అయితే మూడోసారి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. 

ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది .ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ కోసం ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన సెట్ ను కూడా వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలో ఈసెట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లుగా సమాచారం.

 అయితే ఈ సెట్ కోసం దాదాపు పది కోట్లు పైగానే ఖర్చు చేసి ఓ ఇంటి సెట్ ను వేస్తున్నట్లుగా తెలుస్తోంది .అయితే ఈ సినిమాలో హీరో మహేష్ బాబు ఇంటి కోసం ఈ సెట్ ను వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకా అత్యంత విలాసవంతంగా ఈసెట్ ఉండబోతుందని సమాచారం. సాధారణంగా మహేష్ బాబు చేసే సినిమా కోసం ఖరీదైన సెట్ లను వేస్తూ ఉంటారు. ఇక గతంలో అర్జున్ సినిమా కోసం ఏకంగా మధుర మీనాక్షి టెంపుల్ వేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక 2004వ సంవత్సరంలోనే దాదాపు కోట్ల రూపాయలతో ఆ సెట్ ను వేయడం జరిగింది. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పుడు కలెక్షన్ల పరంగా అంతగా విజయాన్ని సాధించకపోయినప్పటికీ ఈ సినిమాలో నటీనటులుగా నటించిన చాలామందికి మంచి గుర్తింపుతో పాటు అవార్డులు కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటి కోసం దాదాపు పది కోట్ల రూపాయలతో ఈ సెట్ ని వేయడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని చూసేందుకు వెయిట్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: