థియేటర్లు ఖాళీ.. OTT కి రెడీ అవుతున్న మైఖేల్?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా పవర్ ఫుల్ మాఫియా కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మైఖేల్. సందీప్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత వారం విడుదల అయ్యింది.ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ కథ కావడంతో పాటు ఆ తరహా జోనర్ కి ప్రస్తుతం మంచి సక్సెస్ ఉండటంతో మైఖేల్ సినిమా పై కూడా ఎన్నో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కచ్చితంగా తనకి మంచి పాన్ ఇండియా హిట్ ఇస్తుంది అనే సందీప్ కిషన్ కూడా చాలా బలంగా నమ్మాడు.ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.కచ్చితంగా మైఖేల్ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని ప్రమోషన్స్ లో చెప్పారు. అలాగే సందీప్ కిషన్ కెరియర్ లో భారీ హైప్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.అయితే ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


సినిమాలో ప్లాట్ బాగానే ఉన్న దానిని డీల్ చేయడంలో దర్శకుడు దారుణంగా ఫెయిల్ అయ్యాడనే మాట వినిపిస్తుంది.అలా టాలీవుడ్ లో ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ మూవీగా మారిన మైకేల్ సినిమాతో మళ్ళీ సందీప్ కి నిరాశ అనేది తప్పలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఒటీటీ స్ట్రీమింగ్ కి ఇప్పుడు రెడీ అవుతున్నట్టు సమాచారం వినిపిస్తుంది. మైఖేల్ మూవీ ఒటీటీ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. ఈ మూవీని కాస్తా ఆలస్యంగానే ఒటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ అన్ని కూడా దెబ్బకు ఖాళీ అయిపోయాయి.ఇక ఇప్పుడు మూడో వారంలోనే ఒటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి నెల చివరిలో ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: