రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా రామ్ చరణ్ పై ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒక అందమైన జంట. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఒక కార్యక్రమంలో తనను సోఫాలో నుంచి లేపడంతో ఉపాసన ఒక్కసారిగా భంగపడ్డారు. అనంతరం ఇంటికి వెళ్ళాక చరణ్తో ఇంటి పనులు అన్నీ కూడా ఉపాసన దగ్గర ఉండి చేయించిందట. 

అయితే ఇది నిజం కాదు.. ఇక ఈ వీడియోను ఒక ఫ్యాన్ ఎడిట్ చేసింది మాత్రమే. ఇక ఆ వీడియో చాలా సరదాగా ఉండడంతో సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే కొన్ని నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుక జరిగిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ వీడియో అప్పటిది అనమాట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ ఉపాసన సాయిధరమ్ తేజ్ ఒకే చోట కూర్చుని ఉంటారు.ఇక ఆ కార్యక్రమంలో ఒకే సోఫాలో కూర్చోవడంతో కాస్త ఇరుగ్గా ఉంటుంది. దాంతో రామ్ చరణ్ ఉపాసనను పక్క సీట్లోకి వెళ్లి కూర్చొని చెప్పాడు. ఇక ఆ విషయంలో ఉపాసనను రామ్ చరణ్ ఆట పట్టించాడు అని అందరూ అనుకున్నారు.

 రామ్ చరణ్ మరియు సాయిధరమ్ తేజ్ ఉపాసన వెళ్లి పక్క సీట్లో కూర్చోవడంతో నవ్వుతూ ఉంటారు.దీంతో రామ్ చరణ్ ఉపాసనను ఆటపట్టించాలని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ అబ్బాయిల ఫన్ అంటే ఇలా ఉంటుంది అంటూ ఆ వీడియోను షేర్ చేశాడు. ఇక ఆ వీడియోలో భాగంగా ఉపాసన ఇంటికి వెళ్లి రామ్ చరణ్ తో ఇంటి పనులన్నీ చేయించినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. అంతేకాదు ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, స్వయంగా కాఫీ కలిపి ఉపాసనకు ఇవ్వడం ఈ వీడియోలో మనం చూడొచ్చు.ఇక అమ్మాయిల వ్యవహారం ఇలా ఉంటుందని ఈ వీడియోతో చూపించారు ఆ నెటిజన్. ఇక ఈ కాన్సెప్ట్ అందరిని ఆకట్టుకోవడంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: