ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారల పెళ్లి సీజన్ నడుస్తుంది.మొదట ఆలియా భట్ పెళ్లితో మొదలైన ఈ హంగామా తాజాగా కియరా అద్వానీ వరకు వచ్చింది. ఇలా వరుసగా హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన వార్తలు కూడా అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న క్కియారా మరియు సిద్ధార్థ మల్హోత్రా పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన ఈమె ఈ మధ్యకాలంలో బాలీవుడ్ కే పరీతమితమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హిందీ సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉంది ఈమె.

 చేతినిండా బాలీవుడ్ సినిమాలతో అనేక సినిమాల్లో నటిస్తోంది ఈమె. ఇదిలా ఉంటే ఇక బాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన జాకీ భాగ్నానితో ప్రేమలో ఉందని ఆ మధ్య జోరుగా వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ వార్తలు వస్తున్న సమయంలోనే డ్రగ్స్ కేసు తనని వెంటాడాదనంతో ఆ వార్తలకి కాస్త బ్రేక్ పడింది అయినప్పటికీ దాని తర్వాత జాకీ తో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో ఉంది అని వారిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు వచ్చాయి. ఇటీవల తరచూ తనపై వస్తున్న వార్తలకి గాను చెక్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్ .అంతేకాదు ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె..

నీవు నా పక్కన లేకుండా రోజు అనేదానికి అసలు అర్థం ఉండదు నువ్వు లేకపోతే ఎంత రుచికరమైన ఆహారమైన ఒంటికి పట్టదు నాకు ఓ ప్రపంచంగా మారిన మంచి సోల్మెట్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.దాంతో జాకీ కి మరియు రకుల్ కి మధ్య ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారని తెలుస్తోంది.. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం .ఏప్రిల్ లేదా మే నెలలో వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: