
ఇదిలా ఉంటే ఈ సినిమాకు బాలకృష్ణ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. 108వ సినిమాకు బాలయ్య 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పారట. ఇక మరోపక్క డైరెక్టర్ అనీల్ రావిపుడి కూడా 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగాడట. అయితే అతని రెమ్యునరేషన్ మాత్రం కొంత డబ్బు రూపంలో మిగతాది బిజినెస్ పర్సెంటేజ్ రూపంలో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్.బి.కె 108 మాత్రం బిగ్ డీల్ అని చెప్పొచ్చు.
ఇక రెమ్యునరేషన్స్ కి 30 కోట్ల దాకా ఖర్చు అవుతుండగా సినిమా కోసం మరో 50 నుంచి 60 కోట్లు అనగా ఎన్.బి.కె 108 సినిమా 80 నుంచి 90 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఎలాగు 100 కోట్ల పైన బిజినెస్ చేస్తుంది కాబట్టి అలా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. వీర సిం హా రెడ్డి సినిమా ఫుల్ రన్ లో 105 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. సో ఇప్పుడు ఎన్.బి.కె 108 అంత బిజినెస్ చేస్తుంది. సో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే అంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. బాలయ్య సినిమా కరెక్ట్ గా పడితే రికార్డులు కొట్టడం పక్కా. మరి అనీల్ మార్క్ మూవీతో బాలకృష్ణ ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.