టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాశిఖన్నా. మొదట తెలుగులో సినిమాలు చేసిన ఈమె.. ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా ఇప్పుడు వెబ్ సిరీస్లో చేయడం కూడా మొదలుపెట్టింది ఈమె. రాశిఖన్నా ఫర్జి సిరీస్లో ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘ అనే పాత్రను పోషించడం జరిగింది.ఇక ఈ వెబ్ సిరీస్ రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందింది. ఇక ఈ సిరీస్ లో షాహిద్ కపూర్ ,విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ నేపథ్యంలోనే రాశికన్నా పాత్రికేయులతో ముంచిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రుద్రా తరువాత హిందీలో నా రెండో సిరీస్ ఇది.. మొదట నాకు ఈ కథ వినిపించినప్పుడు నకిలీ కరెన్సీ గురించి తెలుసుకోవడం నేను మొదలు పెట్టాను.. అలా తెలుసుకుంటున్న సమయంలోనే నాకు ప్రతి ఐదు నోట్లలో ఒక ఫేక్ కరెన్సీ ఉంటుందని తెలిసింది.. సాధారణంగా సినిమాలతో కంటే వెబ్ సిరీస్ లలోనే భావోద్వేగాన్ని మరింత బలంగా ఆవిష్కరించి వీలుంటుంది.. అంతేకాదు పెద్ద తెరపై సినిమా చూడడాన్ని మించిన అనుభవం మరొకటి ఉండదు.. ఇకపోతే ఈ సిరీస్ లో షాహిద్ కపూర్ మరియు విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలతో నటించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది..

అంతేకాదు వెబ్ సిరీస్ లలో మరియు సినిమాలలో సమానంగా నటించడం నాకు పెద్దగా కష్టంగా ఏమీ అనిపించలేదు.. ఎక్కడ నటించినప్పటికీ షూటింగ్ వాతావరణం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.. ఇదిలా ఉంటే ఇక తెలుగులో నాలుగు సినిమాలు చర్చ దశలో ఉన్నాయి.. మరొక నెల రోజుల వ్యవధిలో కచ్చితంగా వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తాను..ఈ  నేపథ్యంలోనే పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పెళ్లికి నాకు ఎలాంటి తొందర లేదు.. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు.. సినిమాల్లో ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను.. ఒకవేళ నా పెళ్లి కుదిరితే స్వయంగా ఆ విషయాన్ని నేను అధికారికంగా ప్రకటిస్తాను.. అంటూ తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది రాశిఖన్నా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: